పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : మరల జరాసంధుఁడు శ్రీకృష్ణునిపై దండెత్తుట

 జరాసంధుఁడు త్యుగ్రలీల
కోటిరథకరిప్రకరంబుఁ గూర్చి
యీక్షింప నదిగాక యిరువదినాల్గు
క్షోహిణులు దాను టదండువచ్చి
ధురపై విడిసిన దిఁ జింత వొడమి
ధువైరి హలియు నమ్మగధీశుకడకు
ల్లనఁ గాల్నడ రుదేర వీర
లెల్లను జూచి వీరెవ్వరో యనఁగఁ 
ని జరాసంధుఁ డచ్చటఁ గోపుఁ డగుచు
వెనువెంట నడువంగ వెఱచిన భంగిఁ 
రువంగ మగధాధితి సేనతోడ
రిమురిఁ దరుమంగ తిదూరమరిగి